‘వజ్రతేజ’లో బియ్యం నాణ్యత పరిశీలన
హాలియా : అనుముల మండలం పాలెం గ్రామ సమీపంలోని వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆదివారం ఫిలిప్పిన్స్ దేశ అధికారులతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి బియ్యం నాణ్యతను పరిశీలించారు. ఫిలిప్పిన్స్ దేశానికి బియ్యాన్ని ఎగుమతి చేయడానికి ఆ దేశ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బియ్యం పరిశీలించిన వారిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఫౌరసరఫరాల సంస్థ మేనేజర్ హరీష్, వజ్రతేజ రైస్ క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టిపోలు యాదగిరి, హాలియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పేలపూడి బాలకృష్ణ, వజ్రతేజ రైస్ డైరెక్టర్స్ చిట్టిపోలు వెంకటేశ్వర్లు, కుక్కడపు రమేష్, చిట్టిపోలు రంజిత్, కొత్త సుదర్శన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మేనేజర్ చిత్తనూరి పవన్ కుమార్, అనుముల మండల ఇంచార్జ్ తహసిల్దార్ రఘు, పెద్దవూర డిప్యూటీ తహసిల్దార్ ఎండీ ముక్తార్ తదితరులు ఉన్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తొద్దు
చండూరు : వేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె చండూరు మున్సిపాలిటీలో, గ్రామాల్లో నీటి ఎద్దడిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల్లో జనాభా ఆధారంగా నిధులు వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మునవర్ అలీ, డీఈ మనోహర, ఏఈ పూజిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment