సెర్ప్‌లో.. మెప్మా విలీనం!
పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు, ప్మా సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
నల్లగొండ టూటౌన్ : పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్‌డీఓలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే.. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లా కేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయం ఉద్యోగులు అందరూ సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు.
కమిషనర్ల ఆధ్వర్యంలో
మెప్మా సిబ్బంది విధులు
మున్సిపాలిటీల్లో మహిళలను గ్రూప్‌లుగా ఏర్పాటు చేసే మెప్మా ఉద్యోగులు జిల్లాలో 18 మంది వరకు ఉన్నారు. అదే విధంగా వార్డుల్లో క్షేత్రస్థాయిలో పని చేసే మెప్మా రిసోర్స్ పర్సన్లు 130 మంది వరకు ఉన్నారు. వీరంతా మున్సిపాలిటీ కమిషనర్ల ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. వీరు మహిళా సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడంతో పాటు నెల నెలా తిరిగి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటారు. ఇక.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని సెర్ప్ కార్యాలయం కింద పనిచేసే ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే మెప్మా ఉద్యోగులు సెర్ప్ కార్యాలయంలో విధులు నిర్వర్తించనున్నారు.
ఫ ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం
ఫ మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు డీఆర్‌డీఓ పరిధిలోకి..
Comments
Please login to add a commentAdd a comment