కేంద్రానికి అశాసీ్త్రయ డీపీఆర్ పంపారు
చౌటుప్పల్ : రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి అశాసీ్త్రయంగా పంపించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన ట్రిపుల్‌ఆర్ భూనిర్వాసితులు మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్‌ను కలిశారు. ఎలాగైనా నిబంధనల ప్రకారం 40కిలోమీటర్ల దూరం నుంచి అలైన్‌మెంట్ మార్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తప్పులతో కూడిన డీపీఆర్‌కు కేంద్రం ఏ విధంగా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉత్తర భాగంలో శాసీ్త్రయంగా డీపీఆర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్, భూనిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, మారుపాక రామలింగం, జాల వెంకటేష్, దబ్బేటి రాములు, బోరెం ప్రకాష్‌రెడ్డి, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం, నర్సింహ, గుండెబోయిన వేణు, బలికే మధు, నాగవెళ్లి దశరథ, జనార్దన్‌రెడ్డి, సుధాకర్, వల్లూరి బోవయ్య, శ్రీశైలం, జోసెఫ్, బాలమల్లయ్య, కార్తీక్, మల్లేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్
Comments
Please login to add a commentAdd a comment