ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
కొండమల్లేపల్లి : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకొని.. వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. మంగళవారం కొండమల్లేపల్లి ఎస్పీ బాలికల గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట గది, స్టోర్ రూం, కూరగాయలు, బియ్యం నిల్వ ఉంచే స్థలాలను, తరగతి గదులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంపై ప్రిన్సిపాల్, సిబ్బందిని అభినందించారు. అనంతరం కలెక్టర్ 8వ తరగతి ఏ సెక్షన్‌కు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, ఇంగ్లిష్, మ్యాథ్స్‌తో పాటు పలు సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. తర్వాత విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ శౌరీలు, ఎంపీడీఓ బాలరాజురెడ్డి తదితరులున్నారు.
నీట్ ప్రవేశ పరీక్షకేంద్రాల పరిశీలన
నల్లగొండ : మే 4వ తేదీన నిర్వహించనున్న నీట్ ప్రవేశపరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. కేంద్రాల్లో అవసరమైన టేబుళ్లు, వెంటిలేషన్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. నల్లగొండలోని ఎస్‌పీఆర్, నారాయణ, అరబిందో తదితర పాఠశాలలను పరిశీలించాలని ఆర్డీఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, నీట్ పరీక్షల లైజనింగ్ ఆఫీసర్ పార్థసారధి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment