ఎన్జీ కాలేజీలో యూత్ పార్లమెంట్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కాలేజీలో ఈనెల 12, 13 తేదీల్లో యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. మంగళవారం యూత్‌పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా యువకులు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఎన్జీ కాలేజీలో రెండు రోజుల పాటు జిల్లాస్థాయి యూత్ పార్లమెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంజీ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కో కోఆర్డినేటర్ డాక్టర్ పి.మద్దిలేటి మాట్లాడుతూ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు నోడల్ కళాశాలగా ఎన్జీ కాలేజీని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ మూడు జిల్లాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. పాల్గోనే విద్యార్థులు శ్రీవాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూశ్రీ అనే అంశంపై ఒక్క నిమిషం వీడియో తీసి మై భారత్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 150 మందిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారని చెప్పారు. పోటీల అనంతరం పది మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ బి.ప్రవీణ్ సింగ్, ప్రోగ్రాం ఆర్గనైజర్ కొండానాయక్, ప్రెస్ కన్వీనర్ శ్రీధర్, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎం.వెంకట్‌రెడ్డి, ఎన్.కోటయ్య, ఏ.మల్లేశం, ఎం.సావిత్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment