వటపత్రశాయికి వరహాల లాలీ..
ఫ రాత్రి హంస వాహనంపై
ఊరేగిన శ్రీస్వామి
ఫ నాల్గవ రోజుకు చేరిన
యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవా రం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరు, మాడ వీధుల్లో వటపత్రశాయి అలంకారసేవలో ఊరేగించారు. వేకువజామున నిత్యారాధనలు చేపట్టిన తరువాత, పారాయణీకులు వేద పారాయ ణం పఠించారు. అనంతరం శ్రీస్వామి వారిని వట పత్రశాయి అలంకరణలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్‌రావు, అనువంఽశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
సాయంకాలం వేళ..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామి వారిని హంస వాహన సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు నుంచి సాగింది.
ఆలయంలో నేడు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీస్వామి వారిని బుధవారం ఉదయం శ్రీకృష్ణాలంకారణ (మురళీ కృష్ణుడు) సేవ చేపట్టనున్నారు. సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment