నూతన కార్యవర్గం ఎన్నిక
చిట్యాల: చిట్యాల–మునుగోడు రూట్ ప్యాసింజర్ ఆటో యూనియన్ నూతన కార్యవర్గాన్ని మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బత్తుల జనార్దన్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా పామనగుళ్ల బుచ్చిరాములు, కోశాధికారిగా దొడ్డి శ్యామ్, కార్యదర్శిగా బత్తుల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా భగవంతు, ప్రచార కార్యదర్శిగా రామ్, కార్యవర్గ సభ్యులుగా చిర్రగోని నర్సింహ, జోగు లింగస్వామి, బైరు భిక్షం, గంజి శేఖర్, జక్కల వెంకన్నలు ఎన్నికయ్యారు.
బీఆర్‌ఎస్ పార్టీలో చేరిక
శాలిగౌరారం: మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని వెంకన్న సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి వెంకన్న గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయితగోని వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చన బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరినవారిలో జోలం నరేందర్, నరేశ్, రామలింగయ్య, జంగిలి సైదులు, నవీన్, నరేశ్, రెడ్డిపోయిన విజయేందర్, మట్టిపల్లి లింగస్వామి ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కట్ట వెంకట్‌రెడ్డి, భూపతి ఉపేందర్, రాగి దావీద్ పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
తిప్పర్తి : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం రాత్రి తిప్పర్తి మండల కేంద్రంలోని గౌతమ్ హైస్కూల్‌లో నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం పలువురు విద్యార్థులకు డీఈఓ మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో గౌతమ్ గ్రూప్ చైర్మన్ రమేష్‌రెడ్డి, ఎంఈఓ నర్సింహనాయక్, ప్రిన్సిపాల్ అజాజ్, ఉపాధ్యాయులు భిక్షమాచారి, ఫయాజ్, కవిత, అస్ర, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
స్వామివారి రథోత్సవం
మర్రిగూడ : మండలంలోని శివన్నగూడ గ్రామ శివారులో శ్రీ నీలకంఠ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భగా స్వామివారం రథోత్సవం నిర్వహించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ రాపోలు గిరి, ఎంపీడీఓ మునయ్య, నాయకులు వెన్నమనేని రవీందర్‌రావు, మేతరి యాదయ్య, చిట్యాల రంగారెడ్డి, జంగిలి రవి, మాదగోని శ్రీనివాస్, బండి హన్మంతు, మహేష్, గ్యార వెంకటేష్, ఊరిపక్క మహేందర్, వల్లపు భాస్కర్, సిలువేరు యాదయ్య పాల్గొన్నారు.
నేడు శ్రీ కనకదుర్గ ఆలయ వార్షికోత్సవం
చిట్యాల: పట్టణంలోని శ్రీకనకదుర్గ ఆలయ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, అమ్మవారికి క్షీరాభిషేకం, గణపతి పూజ, స్వస్తివాచనం, మంటపారాధన, అనంతరం వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజలు, దుర్గా హోమం నిర్వహిస్తారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ తెలిపారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
నూతన కార్యవర్గం ఎన్నిక
నూతన కార్యవర్గం ఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment