బీఆర్‌ఎస్ గొంతు నొక్కుతున్న ప్రభుత్వం
మిర్యాలగూడ : అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతోందని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని అసెంబ్లీ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ.. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో మోసిన్‌అలీ, చిట్టిబాబునాయక్, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, పాలుట్ల బాబయ్య, ధనావత్ బాలాజీనాయక్, చిర్ర మల్లయ్యయాదవ్, మగ్ధూంపాషా, సాధినేని శ్రీనివాస్, షోయబ్, వజ్రం, మాజీద్, మల్లేష్‌గౌడ్, రాములుగౌడ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment