ఎన్నికల సంఘానికి పార్టీలు సహకరించాలి
నల్లగొండ : పారదర్శక, స్వచ్ఛమైన ఫొటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా చేపట్టే మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సహకరించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. శనివారం ఆయా పార్టీల నేతలో తన చాంబార్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో నాయకులు అశోక్, పిచ్చయ్య, లింగస్వామి, నర్సిరెడ్డి, రజీవుద్దీన్, హన్సి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment