కాంగ్రెస్ ప్రభుత్వానిది మొద్దు నిద్ర
చిట్యాల : భూగర్భ జలాలు తగ్గిపోయి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తల్లడిల్లుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో ఎండుతున్న వరి చేలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చిరుమర్తి మాట్లాడుతూ ఎండిపోతున్న పంటలను కొందరు రైతులు పశువులకు మేపుతుండగా, మరికొందరు వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్‌లతో నీటిని సరఫరా చేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిపై అసెంబ్లీలో సస్పెన్షన్ విధించడం తగదని చిరుమర్తి అన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ ప్రభుత్వానిది మొద్దు నిద్ర
Comments
Please login to add a commentAdd a comment