గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి
నల్లగొండ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద భద్రతను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ప్రతినెల ఈవీఎం గోదాం తనిఖీలో భాగంగా శనివారం ఆమె రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. వారి సమక్షంలోనే ఈవీఎం గోదాం సీల్ తీసి లోపల భద్రపరిచిన ఈవీఎంలను తనిఖీ చేశారు. ఆమె వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి ఉన్నారు.
ఇందిరమ్మ ఇంటి నమూనా ఆవిష్కరణ
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లపై పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment