డీసీసీ పదవికి డిమాండ్!
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై నేతల నజర్
పార్టీ అధికారంలోకి
రావడంతో పోటీ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో డీసీసీ పదవులకు పోటీ ఏర్పడింది. సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పదవీ కాలం ముగియగానే పటేల్ రమేష్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయాలని అనుకున్నారు. అయితే దామోదర్‌రెడ్డి వర్గానికి, రమేష్‌రెడ్డికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో వెంకన్ననే కొనసాగిస్తున్నారు. అలాగే యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్ కుమార్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు అండెం సంజీవరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నల్లగొండ జిల్లాలో మాత్రం శంకర్‌నాయక్ జిల్లా అధ్యక్షుడిగా బొంతు వెంకటయ్య వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే కొత్త డీసీసీ అధ్యక్ష నియామకాలు ఇప్పుడున్న సామాజిక సమీకరణాల ఆధారంగానే ఉంటాయా? ఏమైనా మార్పులు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఫ శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవి
ఇవ్వడంతో మరొకరికి ఛాన్స్
ఫ రేసులో పలువురు సీనియర్ నేతలు
ఫ కార్పొరేషన్ పదవి ఇవ్వలేనివారికి డీసీసీతో సరిపెట్టే వ్యూహంలో పీసీసీ
ఫ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ సమీకరణలపై దృష్టి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులపై పీసీసీ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల తరువాత డీసీసీ అధ్యక్షుల మార్పులతోపాటు, పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. కార్పొరేషన్ పదవులను ఇవ్వలేని వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఇచ్చి సరిపెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా రెండు మూడేళ్లకోసారి డీసీసీ కార్యవర్గం మార్పు చేయాల్సి ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాలు కుదరక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ కోటాలో డీసీసీ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మధ్యలో సూర్యాపేట జిల్లాలో మార్పులు చేయాలని భావించినప్పటికీ పార్టీలో అంతర్గత విభేదాల వల్ల దాని జోలికి పోలేదు. వెంకన్నకు రైతు కమిషన్ సభ్యుడిగా ఇవ్వడం, తాజాగా నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆశావహుల దృష్టి డీసీసీ అధ్యక్ష పదవులపై పడింది.
Comments
Please login to add a commentAdd a comment