పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
నల్లగొండ : పోలీస్ శాఖకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. పోలీస్ శాఖ అంటే నిత్యం ఒత్తిడితో కూడిన ఉద్యోగమని ఒత్తిడిని జయించేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడాయన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత డ్రగ్స్ బారినపడి తమ జీవితాన్ని, భవిష్యత్‌ను నాశనం చేసుకుంటోందని.. యువత డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలిక వసతులతోపాటు డీఎస్సీ నూతన కార్యాలయం, క్వార్టర్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో నల్లగొండలో మత ఘరర్షనలు జరిగేవని.. ఇప్పుడు అలాంటివి ఎక్కడా లేవని ప్రశాంతంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతోందని.. అందరూ సోదరభావంతో మెలిగి నల్లగొండను రోల్ మోడల్‌గా తయారు చేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్రీడల్లో వచ్చే అనుభవాలు నిత్యం ఉద్యోగ నిర్వహణలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎస్సీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ మూడు రోజులు పాటు నిర్వహించిన క్రీడల్లో సుమారు 800 మంది ఉద్యోగులు పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమేష్, కొలను శివరాంరెడ్డి, రాజశేఖర్‌రాజు, సీఐలు, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.
ఫ క్రీడాపోటీలు పోలీసులకు ఉపయోగం
ఫ డీఎస్పీ కార్యాలయం, పోలీసులకు క్వార్టర్ల నిర్మాణానికి కృషి
ఫ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
ముగింపులో మంత్రి కోమటిరెడ్డి
పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం
Comments
Please login to add a commentAdd a comment