చందంపేటకు.. డిండి జలాలు
సాగు విస్తీర్ణం పెరుగుతుంది
చందంపేట, నేరెడుగొమ్ము మండలంలోని చాలా మంది రైతులు బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతుల పొలాలకు నీరు అందించడానికి సర్వే చేశారని తెలిసింది. ప్రభుత్వం కూడా నిధులు మంజూరుచేసి కాల్వలు నిర్మిస్తే ఈ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఇన్నాళ్లూ బోరు నీళ్లు, వర్షాలపైనే ఆధారపడి సాగు చేసినం. ఈ కాల్వలు నిర్మాణం చేపడితే.. ఇక్కడి రైతులకు ఢోకా ఉండదు.
– జెల్లెల వెంకటయ్య, రైతు, చందంపేట
చందంపేట : వర్షాలపైనే ఆధారపడి పంటలు సాగు చేసే ఉమ్మడి చందంపేట మండలానికి కాల్వ ద్వారా సాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. డిండి నుంచి కాల్వ ద్వారా సుమారు 18వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వే పనులు పూర్తి చేసింది. సుమారు రూ.400 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు చేపడితే ఈ ప్రాంతం సస్యశామలం కానుంది.
రూ.1.30 కోట్లతో సర్వే..
ఉమ్మడి చందంపేట మండలంలోని భూములకు డిండి ప్రాజెక్టు నుంచి నీరు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నారాయణరెడ్డి (ఎన్‌ఆర్)సంస్థ ద్వారా రూ.1.30 కోట్లతో సర్వే చేపట్టింది. డిండి మండలంలోని ఎర్రారం నుంచి 17.5కిలోమీటర్ల దూరం ఉన్న ఉమ్మడి చందంపేట మండలానికి కాల్వ ఉంది. దాని ద్వారా మండలంలోని భూములకు నీరు అందించేందుకు నిర్మించాల్సి ఉన్న మైనర్, సబ్ మైనర్ కాల్వలను సర్వే చేసింది. కెనాల్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల మేర మైనర్, సబ్‌మైనర్ కాలువలు నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. ఈ సర్వే గ్రాఫ్ వివరాలను పొందుపర్చడానికి మూడు నెలల సమయం పడుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పనులు చేపట్టిన అధికారులు సర్వే డిజైన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. సర్వే పనులు పూర్తయిన తర్వాత కాలువల నిర్మాణానికి సుమారు రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైన నిధులు విడుదల చేస్తే చందంపేట మండల రైతాంగానికి మంచి రోజులు వస్తాయి.
ఫ రూ.400 కోట్లతో మెనర్, సబ్ మైనర్ కాల్వల
నిర్మాణానికి సిద్ధమైన ప్రతిపాదనలు
ఫ ఇప్పటికే పూర్తయిన సర్వే
ఫ 18వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక
చందంపేటకు.. డిండి జలాలు
చందంపేటకు.. డిండి జలాలు
Comments
Please login to add a commentAdd a comment