జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి
నకిరేకల్ : సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిని శాసన సభ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుడు డాక్టర్ నలగాటి ప్రసన్నరాజ్ మాట్లాడుతూ జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు యల్లపురెడ్డి సైదిరెడ్డి, ఏడుకొండలు, చెరుకు వెంకటాద్రి, బొడ్డు వెంకన్న, రమేష్, మేకల దేవయ్య, జెరిపోతుల అంజయ్య, చౌగోని శంకర్, వంటెపాక సుందర్, గిద్దె అంజయ్య, మండలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం సరికాదు
మునుగోడు: ప్రజల సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం సరైంది కాదని బీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ మందుల సత్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరు కాకుండా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మునుగోడులో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగిస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పగిళ్ల సతీష్, ఈద శరత్‌బాబు, మారగోని అంజయ్య గౌడ్, మేకల శ్రీనివాస్‌రెడ్డి, మాదరబోయిన పరమేష్, బోయ లింగస్వామి, యడవల్లి సురేష్, దోటి కరుణాకర్, ఐతగోని విజయ్‌గౌడ్, సింగం సైదులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలి
Comments
Please login to add a commentAdd a comment