మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
శాలిగౌరారం: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండలంలోని ఇటుకులపహాడ్, వల్లాల గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడెంలలో శుక్రవారం వారు పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీఆర్‌ఆర్ నిధులు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీరాజ్ శాఖకు చెందిన 5 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపడమే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్‌ఎస్ పాలకులు 10 సంవత్సరాలు రోడ్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నరిగె నర్సింహ, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, నూక కిరణ్‌కుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ కొండయ్య, ఏఈ భరత్‌చంద్ర, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు అల్లి సైదులు, షేక్ ఇంతియాజ్, చైతన్యరెడ్డి, ఫయాజ్, రామచంద్రయ్య, అవిలయ్య, నరేశ్, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి,
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్
Comments
Please login to add a commentAdd a comment