యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు
సాక్షి, యాదాద్రి : తిరుమల తిరుపతి బోర్డు తరహాలో యాదగిరిగుట్ట పాలకమండలి(వైటీడీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్ట ఆలయానికి పాలక మండలిని 18 మందితో ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ ప్రవేశపెట్టిన బిల్లులో వెల్లడించారు. పాలకమండలి పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవు. టీఏ, డీఏ ఇస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు చేసిన ప్రకటన మేరకు యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయిలో పాలకమండలి ఏర్పాటుకు చట్ట సవరణ కోసం బిల్లును శాసనసభలో పెట్టారు. చైర్మన్ తోపాటు, వివిధ అనుభవజ్ఞులైన, అంకితభావం కలిగిన ట్రస్టీలను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం ఆలయ చైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులు ఉంటారు. ఫౌండర్ ట్రస్టీతోపాటు ఒక ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సభ్యులతోపాటు మరో నలుగురు సభ్యులను నియమిస్తారు. పాలక మండలిలో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా 9 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. టీటీడీ బోర్డు మాదిరిగా వైటీడీ బోర్డుకు ఐఏఎస్ అధికారి ఈఓగా ఉంటారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం చేస్తుంది. టీటీడీబోర్డు తరహాలో యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించవచ్చు.
టెంపుల్ సిటీకి స్వయం ప్రతిపత్తి
యాదగిరిగుట్ట ఆలయానికి 1,241 ఎకరాల భూమి ఉంది. బిల్లు తరువాత ఈ ప్రాంతం అంతా కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన టెంపుల్ సిటీగా మారుతుంది. ఇందులో దేవాలయ ప్రాంతం ప్రత్యేక టౌన్ షిప్‌గా మారనుంది. నూతనంగా ఏర్పాటయ్యే టెంపుల్ సిటీలో భిక్షాటన నిషేధం. మద్యం అమ్మకాలు, జంతువధ కూడా నిషేధిస్తారు. లైసెన్స్‌లు లేని వ్యాపారాలు చేయవద్దు.
ఫ శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి
ఫ 18 మంది సభ్యుల నియామకం
ఫ పాలక మండలికి రెండేళ్ల పదవీ కాలం
ఫ శాశ్వత సభ్యునిగా ఫౌండర్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment