ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
చందంపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం చందంపేట మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం చందంపేట కేజీబీవీని సందర్శించి తన పేరు ఏమిటని, తాను ఎవరినని విద్యార్థులను అడిగారు. కలెక్టర్ అని విద్యార్థులు బదులివ్వడంతో ఎలా తెలుసుంటూ ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ 8, 9 తరగతుల విద్యార్థులకు గణితం బోధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వంట గదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. పాఠశాలలో ఏఎన్‌ఎం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎస్‌ఓ కవిత.. కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే ఏఎన్‌ఎం నియమిస్తామన్నారు. తదుపరి చందంపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి గర్భిణులు, బాలింతలతో కాసేపు మాట్లాడారు. ఓ గర్భిణి 9 నెలల గర్భస్రావం కావడంపై స్పందించిన కలెక్టర్.. గర్భాధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆకుకూరల ప్రాధాన్యతను తెలియజేశారు. మారుమూల విధి నిర్వహణలో నిబద్ధత చూపడం పట్ల తహసీల్దార్ శ్రీనివాస్‌ను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ లక్ష్మి, మెడికల్ ఆఫీసర్ చందులాల్, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, సీడీపీఓ చంద్రకళ, ఎస్‌ఐ సతీష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సత్యకుమారి, అధికారులు తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment