సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్‌నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.