నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని వార్డులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను పలుకరించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగుల అభిప్రాయాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అన్వేష్, పాల్గొన్నారు.
సర్వీస్ రూల్స్‌పై ఉద్యోగులకు అవగాహన
నల్లగొండ : పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల కింద జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన ఉద్యోగులకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వీస్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగాలు పొందిన వారు అన్ని రూల్స్ తెలుసుకుని ఉద్యోగంలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, నాయకులు కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధ స్వరం వినిపించారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవామూర్తులకు నిత్యకల్యాణంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జీజీహెచ్‌లో వార్డుల తనిఖీ
జీజీహెచ్‌లో వార్డుల తనిఖీ