టెన్త్ పరీక్షలకు 40 మంది గైర్హాజరు
నల్లగొండ : పదో తరగతి పరీక్ష శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన తెలుగు పరీక్షకు 18,511 మంది విద్యార్థులకుగాను 18,471 మంది పరీక్షకు హాజరయ్యారు. 40 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ, గుర్రంపోడు తదితర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈఓ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి పరీక్షకు హాజరైన విద్యార్థులు, ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు.
ఫ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి