నల్లగొండ : భారత సైనిక దళంలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తునట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద జనరల్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్‌గా చేరవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలను www.joi nindianarmy.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆమె తెలిపారు.
మానసిక దివ్యాంగులకు అండగా న్యాయ వ్యవస్థ
రామగిరి (నల్లగొండ) : మానసిక దివ్యాంగులకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల్లగొండలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానసిక దివ్యాంగుల హక్కుల రక్షణకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానసిక దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. వారి హక్కులను న్యాయస్థానాల ద్వారా కాపాడుతామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిరిగిరి వెంకట్‌రెడ్డి, గిరి లింగయ్యగౌడ్, నిమ్మల బీమార్జున్‌రెడ్డి, లెనిన్‌బాబు, ప్రసాద్, శివరామకృష్ణ, వెంకటరెడ్డి, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్‌మేళా
నల్లగొండ : నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం కార్తీకేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాకు ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 200 మంది విద్యార్థినులు హాజరయ్యారు. యాపిల్ సంస్థలో విడిభాగాలను సమకూర్చే ఉద్యోగాలకు విద్యార్థినులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.17,200 వేతనం, ఉచిత హాస్టల్, క్యాంపస్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, టీఎస్ కేసి కోఆర్డినేటర్ రాంరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్, ఆయేషా, ప్లేస్‌మెంట్ నిర్వాహకులు కెఎన్‌డి.మూర్తి, రేణుక పాల్గొన్నారు.
భూగర్భ జలశాఖను
సంప్రదించాలి
నార్కట్‌పల్లి : బోర్లు వేయాలనుకునే వారు ముందుగా భూగర్భ జలశాఖను సంప్రదిస్తే బోరువెల్ పాయింట్ కోసం శాసీ్త్రయంగా సర్వే చేస్తుందని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి కె.రేవత్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శనివారం నార్కట్‌పల్లి మండలం నెమ్మాని గ్రామంలో గల రైతువేదిక వద్ద జిల్లా భూగర్భ శాఖ–ప్రతిభ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ‘భూగర్భ జలాల సంరక్షణ–నీటి వినియోగం’పై ఏర్పా టు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అనంతరెడ్డి, మండల ప్రత్యేకాధి కారి చరితారెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీఓ ఉమేష్, ఏఓ గౌతమ్, శ్వేత, మానస, రజని, కుమార్, లక్ష్మయ్య, రాకేష్‌రెడ్డి, జావెద్, నర్సింహ, మహేష్, యాదగిరి ఉన్నారు.
సైనికదళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు
సైనికదళంలో ఉద్యోగాలకు దరఖాస్తులు