30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

30న హుజూర్‌నగర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి

Published Wed, Mar 26 2025 2:04 AM | Last Updated on Wed, Mar 26 2025 2:02 AM

సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

హుజూర్‌నగర్‌ : ఈనెల 30న ఉగాది పర్వదినం నాడు హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి వస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

● 30న సాయంత్ర 5 గంటలకు సీఎం హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి బయలుదేరుతారు.

● 5.45 గంటలకు హుజూర్‌నగర్‌ శివారులోని రామస్వామి గుట్ట వద్ద హెలిపాడ్‌లో దిగి అక్కడ నిర్మాణంలో ఉన్న 2వేల సింగల్‌ బెడ్రూం ఇళ్ల మోడల్‌ కాలనీని పరిశీలిస్తారు.

● అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి హుజూర్‌నగర్‌ పట్టణంలోని బహిరంగ సభా ప్రాంగణం సమీపంలోగల హెలిపాడ్‌లో 6.15 గంటలకు సీఎం దిగుతారు.

● 6.15 గంటలనుంచి 7.30 గంటల వరకు సభా వేదికపై నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

● తదుపరి ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడతారు.

● రాత్రి 7.30 గంటలకు సీఎం హుజూర్‌నగర్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరుతారు

● రాత్రి 9.45కి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement