నకిరేకల్ : రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని జిల్లా పోలీసు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులు కొలిక్కి తెచ్చారు. బంధువుల పిల్లలకు ఎక్కవ మార్కుల వచ్చేలా చేయడం కోసమే ఇదాంతా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాక్షి వరస కథనాలతో పాటు.. మంగళవారం సాక్షిలో ‘ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంతో.. జిల్లా పోలీస్ శాఖ లీకేజీ వ్యవహరాన్ని బట్టబయలు చేసింది. మంగళవారం నల్లగొండలో డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీపై వ్యవహారంపై నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా విచారణ కొనసాగుతోందని ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో అనే అంశాలను వెల్లడించారు.
ఫ ‘సాక్షి’ వరుస కథనాలకు
స్పందించిన యంత్రాంగం
ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ
జిరాక్స్ సెంటర్లకు నోటీసులు..
నకిరేకల్ తహసీల్దార్ ఆదేశాల మేరకు స్థానిక సీఐ రాజశేఖర్ పట్టణంలోని జిరాక్స్ సెంటర్లకు నోటీస్‌లు జారీ చేశారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జిరాక్స్ సెంటర్లు బంద్ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన జిరాక్స్ సెంటర్లపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక పట్ట ణంలో నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ నిఘా పెంచారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సాగేలా చర్యలు తీసుకుంటున్నారు.