మిర్యాలగూడ : ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో భారీ ర్యాలీ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ధాన్యం క్వింటాకు రూ.2800 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, గాదె పద్మమ్మ, తిరుపతి రామ్మూర్తి, సత్యనారాయణరావు, పిల్లుట్ల సైదులు, మల్లయ్య, రమేష్, రామకృష్ణ, రమేష్, నగేష్ పాల్గొన్నారు.