పోలీస్ ఆడిటోరియంలో ఇఫ్తార్ విందు
నల్లగొండ టూటౌన్ : రంజాన్ మాసం సందర్భంగా జిల్లా పోలీస్ ఆడిటోరియంలో మంగళవారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పాల్గొని ముస్లింలకు తెలిపి మాట్లాడారు. ముస్లిం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎంతో భక్తితో నెలరోజుల పాటు ఉపవాసాలు చేస్తారన్నారని పేర్కొన్నారు. అనంతరం వారు ముస్లింలకు బిర్యానీ వడ్డించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, లక్ష్మినారాయణ, శ్రీనివాసులు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.