పాఠశాలల పని వేళలు పెంపు సరికాదు
నంద్యాల(న్యూటౌన్): ఉన్నత పాఠశాలల పనివేళలను పెంచడం సరికాదని ఫ్యాప్టో జనరల్ సెక్రటరీ సుబ్బన్న, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఏపీటీఎఫ్ 257 ప్రధాన కార్యదర్శి శివయ్య, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి నగరి శ్రీనివాసులు అన్నారు. గురువారం వారు డీఈఓ జనార్దన్‌రెడ్డిని కలిసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు స్కూళ్లను నడపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతారన్నారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే వారు సాయంత్రం తిరిగి వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పని వేళల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబశివుడు, రూటా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌కలాం, నాయకులు దస్తగిరి, వ్యాయామ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బత్తుల రవికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment