
ప్రాణాలతో చెలగాటమాడితే సహించం
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రాణాలతో టీడీపీ నాయకులు చెలగాటమాడితే ఇకపై సహించేదిలేదని శ్రీశైలం మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి హెచ్చరించారు. నంద్యాల డీఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్‌ను శనివారం ఆమె కార్యాలయంలో కలిసి టీడీపీ నాయకుల అరాచకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు. బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. బండిఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పుల్లయ్యను టీడీపీ నాయకుడు రామలింగారెడ్డి తీవ్రంగా వేధించారని తెలిపారు. ఇది తట్టుకోలేని పుల్లయ్య తన సెల్‌ఫోన్‌తో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితితో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతల ఒత్తిళ్లతో యూరియా కొరతతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బండిఆత్మకూరు ఎస్‌ఐ తప్పుడు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని కోరామన్నారు. మసీదుపురం గ్రామంలో ఉన్న టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి దాడులు చేశారని, తిరిగి బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేయటం సరైందికాదన్నారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో టీడీపీ నాయకుల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడితే ఇక సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతలపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే తాము రహదారులపైకి వచ్చి నిరసనలు తెలపాల్సి వస్తుందని పేర్కొన్నారు. మాజీ ఎమ్యెల్యేలతో పాటు నాయకులు దేశం సుధాకర్‌రెడ్డి, గన్ని కరీమ్, సోమశేఖర్‌రెడ్డి, పార్థుడు, రాయమాల్పురం బాషా, మహబూబ్, న్యాయవాది కృష్ణారెడ్డి ఉన్నారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు
అండగా ఉంటాం
మాజీ ఎమ్యెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి,
శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment