శివరాత్రికి అదనపు బస్సులు
మహానంది: ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని నంద్యాల ఆర్‌టీసీ డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు. మహానందిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని నంద్యాల నుంచి మహానంది పుణ్యక్షేత్రానికి ప్రతి పదినిమిషాలకు ఒక బస్సు తిరుగుతుందన్నారు. మొత్తం 25 బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గాజులపల్లె రైల్వేస్టేషన్ నుంచి మహానందికి ఆర్‌టీసీ బస్సులు తిప్పుతామన్నారు. నంద్యాల బస్టాండ్‌లో మహానంది బస్సుల కోసం ఐదు ఫ్లాట్‌ఫామ్‌లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని పెంచుతామన్నారు.
విజయవాడకు బోయలకుంట్ల పూలు
శిరివెళ్ల: తాను పదేళ్లుగా నర్సరీని నిర్వహిస్తున్నానని, బోయలకుంట్ల గ్రామం నుంచి పూలను విజయవాడ మార్కెట్‌కు పంపిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రైతు జింకల నారాయణ తెలిపారు. మహదేవపురం, బోయలకుంట్లలో ఉద్యాన పంటల సాగును మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మహదేవపురంలో అరటి పంటల సాగును పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం బోయలకుంట్లలో నర్సరినీ పరిశీలించి, రైతు జింకల నారాయణతో మాట్లాడారు. వరితోపాటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నానని రైతు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి దివ్య, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు సకల సౌకర్యాలు
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను నంద్యాల ఆర్‌డీఓ విశ్వనాఽథ్ ఆదేశించారు. మహానందిలోని పోచా బ్రహ్మానందరెడ్డి డార్మెటరీ భవనంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ విశ్వనాఽథ్ మాట్లాడుతూ.. భక్తుల కాలక్షేపానికి అవసరమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై ఎక్కడైనా పందులు కనిపిస్తే పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆలయ, పంచాయతీ పరిధిలోని అన్ని వీధిలైట్లు వెలగాలని ఆదేశించారు. నంద్యాల ఏఎస్సీ జావళి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వంద మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఉంటుందన్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల వద్ద అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు, మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి , ఆలయ ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎకై ్సజ్ సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శివరాత్రికి అదనపు బస్సులు
Comments
Please login to add a commentAdd a comment