బ్రహ్మోత్సవాలకుపటిష్ట భద్రత
శ్రీశైలంటెంపుల్/ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధవారం శ్రీశైలంలో ఆయన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ క్యూలు, ఆలయ పరిసరాలు, శివస్వాముల ప్రత్యేక క్యూలైన్, స్నాన ఘట్టాలు, రథ మండపం, కమాండ్ కంట్రోల్ రూం, శ్రీశైలం డ్యాం, ఘాట్‌రోడ్డు మొదలైన ప్రదేశాల్లో పర్యటించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్‌కుమార్‌రెడ్డి, దేవస్థాన ఈఈ మురళీ పాల్గొన్నారు.
శివ భక్తుల సౌకర్యార్థం
22 వైద్య శిబిరాలు
గోస్పాడు: శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న భక్తుల సౌకర్యార్థం 22 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటరమణ తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్రాహ్మణ కొట్కూరు నుంచి శ్రీశైలం వరకు ఈ శిబిరాలు ఉంటాయన్నారు. పాదయాత్ర భక్తులు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చునన్నారు.
అధిక ధర యూరియా విక్రయిస్తే చర్యలు
బనగానపల్లె రూరల్: ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత దుకాణాదారుడిపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ హెచ్చరించారు. బుధవారం మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమై మాట్లాడారు. యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. జిల్లాలో యూరియా కొరత లేదని చెప్పారు. అంతకు ముందు పశువైద్యులు డాక్టర్ బ్రహ్మనందరెడ్డి పశువుల్లో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి రఘువరణ్, వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. హోల్ డీలర్ల వద్ద నుంచి కాకుండా వేరే జిల్లాల నుంచి ఎరువులు తెప్పించుకొని అమ్ముతున్నారన్న సమాచారంతో విజిలెన్స్ వ్యవసాయ అధికారి విశ్వనాథ్ పర్యవేక్షణలో స్థానిక సంతోష్‌రెడ్డి ఏజెన్సీస్‌కి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణంలో 16ః16ః16 రకానికి చెందిన రూ.1,85,625 విలువ గల 135 బస్తాలను సీజ్ చేశారు. అదే విధంగా బాలాజీ కాంప్లెక్స్‌లోని సంజీవరెడ్డి ఏజెన్సీస్‌లో యూరియా గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రూ.16,523 విలువ గల 62 బస్తాలను సీజ్ చేశారు. అనంతరం విజిలెన్స్ వ్యవసాయాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి డీలర్ ఎఫ్‌సీఓ ప్రకారం వ్యాపారాలు చేయాలని లేనిపక్షంలో డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, విజిలెన్స్ కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
బ్రహ్మోత్సవాలకుపటిష్ట భద్రత
బ్రహ్మోత్సవాలకుపటిష్ట భద్రత
Comments
Please login to add a commentAdd a comment