పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ–4 సర్వే
నంద్యాల: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందితో పీ–4 సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పీ–4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– 2047 విజన్‌లో భాగంగా పేదరిక నిర్మూలనకు పీ–4 (ప్రభుత్వ– ప్రైవేటు– ప్రజల భాగస్వామ్య) సర్వే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు. జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారత, తాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు తదితర పది సూత్రాల అనుసంధానంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సచివాలయంలో పది సూత్రాల పట్టికను అతికించాలన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న అతి నిరుపేదల జాబితాలు తయారు చేయాలన్నారు. పీ–4 సర్వే మార్చి 2వ తేదీలోగా పూర్తి చేసి నివేదికలు అందచేయాలన్నారు. ప్రధానంగా తండాలు, చెంచు కాలనీలు, మురికివాడల్లో నివసిస్తున్న అట్టడుగు స్థాయి కుటుంబాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ వేణుగోపాల్, డీఎల్‌డీఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించండి
జిల్లాలో లేబర్ బడ్జెట్ లకా్‌ష్య్‌న్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. డ్వామా ఇన్‌చార్జి పీడీ వెంకటసుబ్బయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కింద వేతనదారులకు పనులు కల్పించి, పెండింగ్‌లో ఉన్న 12 లక్షల పని దినాలను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించే ఈ సమా వేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘి క సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి – శిశు సంక్షేమం, పనులు – ఆర్థిక ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష చేస్తారన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు తమకు కేటాయించిన సమయానికి ఆయా స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని సీఈఓ కోరారు.
కృష్ణమ్మను వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: ప్రాచీన సంగమేశ్వరాలయం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసం వీడనుంది. గతేడాది జూలై నెల చివర్లో ఈ ఆలయం కృష్ణాజలాల్లో మునిగింది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటిమట్టం తగ్గుతుండటంతో ఏడు నెలల పాటు జాలాధివాసంలో ఉన్న ఈ ఆలయ గోపురాలు బయటపడ్డాయి. బుధవారం నాటికి శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం 850 అడుగులకు చేరడంతో ప్రాచీన ఆలయం ప్రహరీ బయట పడింది.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ–4 సర్వే
Comments
Please login to add a commentAdd a comment