రూ.11,972 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక
నంద్యాల: నాబార్డ్ ద్వారా 2025–26 సంవత్సరానికి సంబంధించి పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కింద 11,972 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ పథకాల రుణ మంజూరు పై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో కొంతమేర ప్రగతి సాధించారన్నారు. పెండింగ్‌లో ఉన్న లక్ష్యాన్ని మార్చి 15వ తేదీలోగా పూర్తి చేయాలని బ్యాంకర్లను సూచించారు. చేతివృత్తుల వారికి శిక్షణ ఇస్తున్నామని, వారందరికీ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గడువులోపు సాధించాలన్నారు. వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను అందించాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ నరసింహారావు, నాబార్డు డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ సుబ్బారెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్, కెనరా బ్యాంక్ రీజనల్ హెడ్ సుశాంత్ కుమార్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి.వెంకటరమణ, కేడీసీసీ బ్యాంక్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో రెడ్‌క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్
నంద్యాల(అర్బన్): అత్యవసర వైద్య చికిత్సల కోసం నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చే వారి కోసం త్వరలో రెడ్ క్రాస్ ద్వారా కూడా రక్తం అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. స్థానిక కేసీ కెనాల్ కాంపౌండ్‌లోని మైనర్ ఇరిగేషన్ కార్యాలయ సమూహంలో ఏర్పాటు చేయబోయే రెడ్‌క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి, ట్రెజరర్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ మారుతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment