రుద్రవరం: రైతుల సమక్షంలోనే భూ రీసర్వే చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ ఆదేశించారు. బీరవోలులో సాగుతున్న భూ రీసర్వే పనులను మంగళవారం ఆయన పరిశీలించా రు. భూమి చుట్టుపక్కల రైతులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే రీసర్వే చేయాలన్నారు. రైతుల చెప్పిన వివరాల మేరకే మార్పులు, చేర్పులు చేయా లని, సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేయాలన్నారు. జేసీ వెంట సర్వే, ల్యాండ్ ఏడీ జయరాజు, తహసీల్దార్ మల్లికార్జునరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment