
ధర పడిపోతోంది
మా గ్రామంలో 40 మంది రైతులు పౌల్ట్రీపై ఆధారపడి ఉన్నారు. మేం ప్రతి బ్యాచ్‌లో 5 వేల కోళ్లు పెంచుతాం. ఇవి 40 రోజుల్లో అమ్మకం కావాలి. బర్డ్‌ఫ్లూ కారణంగా కోడి లైవ్ కిలో ధర రూ.87కు పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోళ్లలో ఎలాంటి బర్డ్‌ఫ్లూ లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలి. చికెన్, గుడ్ల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి.
– మధు, తులశాపురం, కర్నూలు మండలం
పరిహారం ఇవ్వాలి
బర్డ్‌ఫ్లూతో కోలుకోలేని విధంగా నష్టపోయాం. మా దగ్గర 10 వేల కోళ్లు ఉన్నాయి. కిలో లైవ్‌పై దాదాపు రూ.50 వరకు నష్టం వస్తోంది. ఈ ప్రకారం మాకు 8 లక్షల రూపాయల నష్టం వస్తోంది. కంపెనీలు చికెన్ ధరను గంట గంటకు తగ్గిస్తున్నాయి. బర్డ్‌ఫ్లూతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం ఇవ్వాలి. చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రచారం చేయాలి. – చంద్రశేఖర్‌రెడ్డి,
జి.సింగవరం, కర్నూలు మండలం
కోలుకోలేని దెబ్బ
బర్డ్‌ఫ్లూ ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నంద్యాల జిల్లాలో ఈ ప్రభావం ఏమాత్రం లేకపోయినా కంపెనీలు ధర తగ్గించాయి. పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. మేం కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగంలో రాణిస్తున్నాం. ప్రస్తుతం ఐదు వేలకు పైగా కోళ్లు ఉన్నాయి. చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ధరలు తగ్గాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – రవికుమార్,
కరివేముల, జూపాడుబంగ్లా మండలం

ధర పడిపోతోంది

ధర పడిపోతోంది
Comments
Please login to add a commentAdd a comment