అధిక ధర చెల్లించి తెచ్చుకున్నాం
యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు సొంత భూమి 5 ఎకరాలు ఉండగా.. 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. మొత్తం వరి సాగు చేశాం. ప్రస్తుతం వరి పొట్ట, కంకిదశలో ఉంది. యూరియా వాడితే బాగా వస్తుంది. కాని ఎక్కడా యూరియా బస్తా కూడా లభ్యం కావడం లేదు. చివరికి నందికొట్కూరులో బస్తా రూ.380 ప్రకారం తెచ్చుకున్నాం. బస్తాకు రూ.400 ఇస్తామన్నా లభించడం లేదు. కొంతమంది మాత్రం అవసరమైన స్థాయిలో తెచ్చుకుంటున్నారు. అదే స్థాయిలో సామాన్య రైతులకు అందని పరిస్ధితి ఉంది. యూరియా బంగారం అయింది. రానున్న రోజుల్లో బస్తా రూ.500 ప్రకారం అమ్ముతారనే ఆందోళన ఉంది.
– మురళీకృష్ణ, రైతు, బండి ఆత్మకూరు
సాగు పెరగడంతోనే యూరియా కొరత
నంద్యాల జిల్లాలో రబీలో వరిసాగు భారీగా పెరిగింది. సాధారణ సాగు కంటే దాదాపు 15 వేల హెక్టార్లు అధికంగా వరి సాగు అవుతోంది. దీంతో కొరత తీవ్రమైంది. నిబంధనల ప్రకారం ఎకరాకు రెండు.. రెండున్నర బస్తాల వరకు మాత్రమే యూరియా ఇవ్వాల్సి ఉంది. కాని చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. 14 టన్నుల యూరియా 15 మంది రైతులు తీసుకున్నట్లు సమాచారం ఉంది. వీరికి భూములు ఉన్నా యా లేదా అనే దానిని చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో 3,000 టన్నుల యూరియా వస్తుంది. అప్పుడు కొరత నుంచి బయటపడతాం. – మురళీకృష్ణ, డీఏఓ, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment