
ఏ కొమ్మ రెమ్మనో!
అది జీనేపల్లె ఎస్సీ కాలనీ. ఆదివారం తెల్లవారుజామున అప్పుడ ప్పుడే జనం నిద్ర లేచి పనుల్లోకి వెళ్తున్నారు. చర్చి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో స్థానిక మహిళలు వెళ్లి చూశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును అక్కడ వదిలేసినట్లు గుర్తించారు. శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే పుట్టిన బిడ్డగా నిర్ధారించారు. గ్రామ ఆశా కార్యకర్తలు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో యర్రగుంట్ల పీహెచ్‌సీ సీహెచ్‌ఓ నాగార్జునరెడ్డి గ్రామానికి చేరుకుని శిశువును పరిశీలించారు. వెంటనే 108లో నంద్యాల వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం శిశువును నంద్యాలలోని శిశు గృహం సిబ్బందికి అప్పగించారు. – శిరివెళ్ల
నవ మాసాలు గర్భంలో నన్ను భద్రంగా చూసుకుంటే సంతోష పడితిని..
కానీ ప్రపంచానికి అనాథగా
పరిచయం చేస్తావునుకోలేదు.
పుట్టిన క్షణమే నీ వెచ్చని ఒడిలో లాలిస్తావని ఆనందపడితిని..
కానీ రక్తపు మరకలు ఆరక ముందే తల్లి ప్రేమకు దూరం చేస్తావనుకోలేదు.
భూమి మీదికి చేరగానే మీ బంధుత్వాన్ని
చూపిస్తావని సంబరపడితిని..
కానీ బతికుండగానే కన్నపేగును
తెంచుకుంటావనుకోలేదు.
ఆడ బిడ్డగా పుట్టాననో, లేక ఏ కష్టమొచ్చి నన్ను దూరం చేసుకున్నావో తెలియదు..
ఆ దేవుడి దయతో నేను క్షేమమే అమ్మా!

ఏ కొమ్మ రెమ్మనో!
Comments
Please login to add a commentAdd a comment