ఓ సామాన్య కుటుంబంలో ఏదైనా శుభకార్యముందంటే సుమారు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్ల హడావుడి కనిపిస్తుంది. అటువంటిది దేవదేవుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎంత హడావుడి ఉండాలి. అయితే, అహోబిల మహాక్షేత్రంలో ఆ ఊసే కనిపించడం లేదు. మరో 12 రోజుల్లో ఉత్సవాలు సైతం ప్రారంభమవుతాయి. ఏర్పాట్లు మాత్రం ఇంకా మొదలే కాలేదు. ఈ విషయంలో అధికారులు, మఠం ప్రతినిధులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
● మరో 12 రోజుల్లో
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● ఏర్పాట్లు చేయడంలో దేవస్థానం
అధికారులు తీవ్ర నిర్లక్ష్యం
● ఇంకా పూర్తికాని టెండర్ ప్రాసెస్
● ఒక్కో పనికి 40 శాతం నుంచి 50
శాతం ‘బి’ ట్యాక్స్ అడుగుతున్న వైనం
● ముందుకురాని కాంట్రాక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment