
టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు
నంద్యాల(న్యూటౌన్): క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల పేరుతో టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఏపీటీఎఫ్ రాష్ట్ర సభ్యులు సాంబశివుడు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం స్థానిక ఆ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థ లేకుండా చేయడం దుర్మార్గమైన విధానమన్నారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏదైనా ఇబ్బందులు జరిగితే విద్యాశాఖ ఉన్నతాధికారులే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు మాధవస్వామి, రవి, పుల్లయ్య, నగిరి వెంకటేశ్వర్లు, మునిస్వామి, పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం
నంద్యాల: కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శ్రీగిరిలో భక్తుల రద్దీ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి బారులు దీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన పలువురు భక్తులు మల్లికార్జున స్వామివారిని స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. క్షేత్ర పురవీధులు భక్తులతో కళకళలాడాయి.
మల్లన్నకు నృత్యనీరాజనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళావేదికపై విజయవాడకు చెందిన నర్తన డ్యాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్యప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో గణపతి ప్రార్థన, శివాష్టకం, శివోహం, అంబాపరాకులు, శంకర శ్రీగిరివాసా తదితర గీతాలకు, అష్టకాలకు.. భవ్యసత్యశ్రీ, భవ్య, లహరి, అలకనంద తదితరులు నృత్యం ప్రదర్శించారు.

టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు

టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు
Comments
Please login to add a commentAdd a comment