![ఆత్మకూరులో 18న జాబ్‌మేళా](/styles/webp/s3/article_images/2025/02/16/15atr04-200082_mr-1739651333-0.jpg.webp?itok=JsAg0zqu)
ఆత్మకూరులో 18న జాబ్‌మేళా
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. జాబ్‌మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను స్థానిక కళాశాలలో వారు శనివారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ జాబ్‌మేళాకు ఐదు ప్రయివేట్ కంపెనీలు (అరబిందో ఫార్మసీ, గ్రీటెక్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, రాయ్స్ డైరెక్ట్ సర్వీసెస్, టాటా కాపిటర్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్) పాల్గొంటాయన్నారు. ఈ జాబ్‌మేళాలలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెకానికల్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6303244165, 7673902328 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment