
No Headline
సినిమా షూటింగ్‌లో
కొండారెడ్డి బురుజు వద్ద
సినీ హీరో మహేష్ (ఫైల్)
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్
● షూటింగ్ స్పాట్లుగా కొండారెడ్డిబురుజు, రాక్ గార్డెన్స్, యాగంటి, అహోబిలం
ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాల చిత్రీకరణ ● క్రమంగా పెరుగుతున్న సినిమా షూటింగులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ ముఖద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లా సినిమాల చిత్రీకరణకు అనుకూలంగా ఉంటోంది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా షూటింగులు ఎక్కువగా కర్నూలులో జరుగుతున్నాయి. కొండారెడ్డి బురుజు బొమ్మ సినిమాలో కనబడితే కచ్చితంగా హిట్టు అవుతుందని చాలా మంది దర్శకుల నమ్మకం. సినిమా హీరోలు సైతం తమ సినిమాల్లోని కొన్ని దృశ్యాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు ప్రణాళిక చేయిస్తుంటారు. ఇక్కడ షూటింగ్స్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఆ సెంట్‌మెంటే చిత్రసీమ కెమెరా లెన్స్ కందనవోలుపై పడేలా చేసింది. ఇటీవల విడుదలైన పుష్ప–2, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ తదితర సినిమాల్లో పలు సన్నివేశాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిత్రీకరించారు.
సీమ యాసకు ప్రాధాన్యం
‘ప్రేమించుకుందాం రాం’ సినిమాతో కర్నూలు సెంటిమెంట్ మొదలైందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమ యాసను జయప్రకాష్ రెడ్డితో మాట్లాడించి గుర్తింపు తెచ్చారు దర్శకులు. ఆ తర్వాత కర్నూలులో చిత్రీకరించిన సినిమాలు నిర్మాతలకు కాసులు కురిపించాయి. కొందరు హీరోలు సెంటిమెంట్‌గా కర్నూలులోని ప్రదేశాలను ఫిల్మ్‌సిటీల్లో సెట్టింగ్స్ వేసి మరీ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. అలా వచ్చిందే మహేష్‌బాబు సినిమా. కొండారెడ్డి బురుజు దగ్గర విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్‌పై హీరో మహేష్ బాబు చేయి చేసుకునే సీన్ హిట్ అయ్యింది. మళ్లీ 17 ఏళ్ల తరువాత అదే కొండారెడ్డి బురుజు సెట్టింగ్‌తో హైదరాబాద్‌లో సినిమా పూర్తి చేసి ‘సరిలేరు నీకెవ్వరు’ మరోహిట్ కొట్టింది. హీరో దగ్గుపాటి రాణా నటించిన నేనే రాజు – నేనే మంత్రి, రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్, సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ సినిమాల చిత్రీకరణ కర్నూలు నగరంలోనే జరిగింది.
యాగంటిలో షూటింగ్ జరిగిన సినిమాలు హిట్ కొట్టాయి. యాగంటి కొలను, మెట్ల వద్ద పలు సినీ సన్నివేశాలు తీశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, నాగార్జున నటించిన అన్నమయ్య, వెంకటేష్ నటించిన జయం మనదేరాం, అరంధతి చిత్రాల్లో కొన్ని సీన్లు బనగానపల్లి పరిసర ప్రాంతాల్లో తీశారు. ఈ చిత్రాలు విజయవంతమవ్వడంతో దర్శకులు యాగంటిని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. 2016లో నాపరాయి గనుల నడుమ బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ‘స్పీడున్నోడు’ మూడు రోజుల పాటు పలుకూరులో చిత్రీకరించారు. బెలుం గుహల్లో సాహసం, స్వామి రారా నిఖిల్ సినిమా షూటింగ్ జరిగింది. హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూ.20 కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన గద్దలకొండ గణేష్ చిత్రం విజయం సాధించింది.
సినిమా విజయోత్సవాలు, ప్రీరిలీజ్ ఈవెంట్‌లకు కర్నూలు వేదికై ంది. గుణశేఖర్ డైరక్టర్‌గా హీరోహీరోయిన్లు చిరంజీవి, అంజలాజువేరి నటించిన చూడాలని ఉంది సినిమా శత దినోత్సవ వేడకులు కర్నూలు డీఎస్‌ఏ స్టేడియంలో జరిగాయి. హీరో వెంకటేష్, హీరోయిన్ సౌందర్య నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాల విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగాయి. హీరో నాగార్జున నటించి ఘోష్ట్, రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్, మహేష్‌బాబు గుంటూరు కారం, బాలకృష్ణ అఖండ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ కార్తీకేయ –2 సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ కర్నూలు నగరంలో జరిగాయి.
సినీ నటుడు
జయ ప్రకాష్‌రెడ్డి
(ఫైల్)

No Headline
Comments
Please login to add a commentAdd a comment