● నేడు గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు
కర్నూలు(సెంట్రల్): గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్ష రాసే వారు 15 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు హాల్ టిక్కెట్‌తో కేంద్రంలోకి వెళ్లాలి. ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండో పేపర్‌ను నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 9,993 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల ఏర్పాట్లు, అధికారుల సమన్వయం కోసం జేసీ డాక్టర్ బి.నవ్యను కోర్డినేట్ అధికారిగా ఏపీపీఎస్‌సీ నియమించింది. గ్రూపు–2 మెయిన్స్ రాత పరీక్షకు వచ్చే అభ్యర్థులు సందేహాలను నివృత్తికి 08518–277305కు ఫోన్ చేయవచ్చని జేసీ డాక్టర్ బి.నవ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment