
No Headline
మహిళల కోలాటం
శ్రీశైలంటెంపుల్: ఓ వైపు ప్రణమిల్లుతున్న భక్త కోటి.. మరో వైపు బ్రహ్మోత్సవ వైభవంతో శ్రీగిరి క్షేత్రం శోభిల్లుతోంది. ఇరుముడితో తరలివచ్చిన శివ స్వాములు స్పర్శ దర్శనం చేసుకుని పులకించిపోతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాల్గవరోజు శనివారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై విహరించగా భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. ముందుగా ఉభయ దేవాలయాల ప్రాంగణంలోని అలంకార మండపంలో మయూర వాహనాన్ని సుగంధ పుష్పాలతో ముస్తాబు చేసి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. ఉభయదేవాలయల ప్రధాన అర్చకులు, వేదపండితులు అర్చనలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం గంగాధర మండపం నుంచి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. కళాకారుల ప్రదర్శనలు కొనసాగుతుండగా, భక్తుల శివ నామస్మరణ హోరెత్తుతుండగా మయూర వాహనంపై శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున విహరించారు. స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, అధికారులు పాల్గొన్నారు.
కాణిపాకం, టీటీడీ తరఫున
పట్టువస్త్రాల సమర్పణ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం తరఫున ఉదయం ఆ దేవస్థాన ఈవో కె.పెంచలకిషోర్ దంపతులు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రా లు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్లకు సాయంత్రం పట్టువస్త్రా లు సమర్పించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు పట్టువస్త్రాలు తీసుకు రాగా శ్రీశైల దేవస్థాన ఈవో, అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో నేడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రావణవాహన సేవ నిర్వహిస్తారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

No Headline

No Headline
Comments
Please login to add a commentAdd a comment