
రేపు శ్రీశైలానికి రాష్ట్ర గవర్నర్ రాక
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సోమవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శ్రీశైలం రానున్నారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబా అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆలయానికి చేరు కుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం రాత్రికి అతిథి గృహంలోనే బస చేసి మంగళవారం ఉద యం విజయవాడకు తిరిగి వెళ్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రద్దయిన సీఎం పర్యటన..
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తు ్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సీఎం పర్యటన వివిధ కారణాల వలన రద్దయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ సునీత తెలిపారు. శనివారం ఆమె జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు మనమిత్ర యాప్‌తో వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అలాగే http://bie.ap.gov.inలో విద్యా ర్థుల ఆధార్ నెంబరుతో, రెండవ సంవత్సరం విద్యార్థులు గత ఏడాది హాల్‌టికెట్ నెంబర్ ఆధారంగా హాల్‌టికెట్ పొందవచ్చన్నారు. నంద్యాల జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 14,239 మంది, ఒకేషనల్ 1,456 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 12,230 మంది, ఒకేషనల్ 11,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు.
రేనాటి సూరీడుఉయ్యాలవాడ నరసింహారెడ్డి
నంద్యాల: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి సూరీడు అని డీఆర్‌ఓ రాము నాయక్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్‌లో నరసింహారెడ్డి 178వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ బ్రిటీష్ పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సాంప్రదాయ వ్యవసాయ వ్యవస్థలో బ్రిటీషుయులు చేసిన మార్పులకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి పోరాటం చేశారన్నారు. 1806 నవంబర్ 24న కర్నూలు జిల్లాలోని రూపనగుడిలో జన్మించి స్వాతంత్య్ర సాధన కోసం బ్రిటీష్ పాలకులతో వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన 1847 ఫిబ్రవరి 22న వీరమరణం పొందారన్నారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సంఘం ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, తిరుపంరెడ్డి, సాయిరాంరెడ్డి, శివకుమార్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ‘మాలల యుద్ధగర్జన’
కర్నూలు(అర్బన్): రిజర్వేషన్లలో ఎస్సీ ఉప వర్గీకరణకు వ్యతిరేకంగా ఆదివారం కర్నూలులో భారీగా రాయలసీమ మాలల యుద్ధగర్జన సభను నిర్వహిస్తున్నట్లు మాల సంఘాల జేఏసీ కన్వీనర్ యాట ఓబులేసు, గౌరవాధ్యక్షులు గోన నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక కార్యాల యంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుందన్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవీప్రసాద్, మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావ్, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, స్వర్గీయ పీవీ రావు సోదరుడు పీఎస్‌ఎన్ మూర్తి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాలలు ఈ సభకు రానున్నారని చెప్పారు.

రేపు శ్రీశైలానికి రాష్ట్ర గవర్నర్ రాక
Comments
Please login to add a commentAdd a comment