
నూతన పద్ధతులతో ఉద్యాన పంటల అభివృద్ధి
మహానంది: వాణిజ్య ఉద్యాన పంటల అభివృద్ధికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నూతన పద్ధతులను రూపొందిస్తోందని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ గోపాల్ అన్నారు. మహానంది సమీపంలోని వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రాంగణంలో శనివారం ఉద్యాన కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వైఎస్సార్ హెచ్‌యూ వ్యవసాయ పరిశోధన, శిక్షణ, సాంకేతిక సేవల ద్వారా మహానంది మండలంలో రైతులు హార్టికల్చర్ రంగంలో రాణిస్తున్నారన్నారు. ఉద్యాన పరిశోధనా స్థానాల్లో ఎక్కువగా ఉల్లి, పసుపు, అరటి, ధనియాలు రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. కొబ్బరి ప్లాంటేషన్‌పై దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మహానంది హెచ్‌ఆర్‌ఎస్ హెడ్ సైంటిస్ట్ డాక్టర్ ముత్యాల నాయుడు, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఠాగూర్ నాయక్, డాక్టర్ కిషోర్, తదితరులు పాల్గొని రైతులకు సలహాలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment