
చిత్ర పరిశ్రమకు కర్నూలు కలిసి వస్తోంది
రాష్ట్ర విజన తర్వాత సినిమా రంగం హైదరాబాద్‌లో స్ధిరపడింది. కర్నూలు జిల్లాలో షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ దర్శకులకు ఉంది. హైదరాబాద్ సిటీకి కర్నూలు దగ్గరగా ఉంది. కర్నూలులో షూటింగ్ స్పాట్లు ఉండటం సినీవాళ్లకు కలిసి వస్తోంది. స్థానిక కళాకారులకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తే మరింత జనాదరణ వస్తుంది.
– పత్తి ఓబులయ్య, ట్రెజరర్,
ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
రాయలసీమకు
ప్రాధాన్యం ఇవ్వాలి
కర్నూలు జిల్లాలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు దాదాపు 90 శాతం విజయం సాధించాయి. కరోనా కంటే ముందు చాలా సినిమాల షూటింగ్‌లు కర్నూలులో జరిగాయి. అవి హిట్ కొట్టాయి. మన ప్రాంతం నుంచి చాలా మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. వీరితో పాటు మిగతావారు సైతం రాయలసీమలో సినిమా షూటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అసవరం ఉంది. – బైటింటి మీనాక్షిరెడ్డి, సినీ నటుడు

చిత్ర పరిశ్రమకు కర్నూలు కలిసి వస్తోంది
Comments
Please login to add a commentAdd a comment