కోవెలకుంట్ల: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా రని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. కోవెలకుంట్ల మండలం కంప మల్లకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత లోకేశ్వరరెడ్డి కుటుంబంపై టీడీపీ గూండాల దాడి చేశారు. లోకేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని గురువారం ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ అభివృద్ధి, మౌలిక వసతులు కల్పించాలని టీడీపీ వర్గీయులు మంత్రి బీసీ వద్దకు వెళితే ముందుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేయండంటూ ప్రోత్సహిస్తుండటం విడ్డూరమన్నారు. టీడీపీ నేతల అధికార దాహం తీరిందని, రక్తదాహం తీరలేదని, అందుకే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్త లపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూదనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఏజెంట్లు కూడా లేకుండా చేయాలనే తలంపుతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు.
వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం..
కంపమల్లలో వైఎస్సార్‌సీపీ నేత కుటుంబంపై జరిగిన దాడి సంఘటనను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని కాటసాని తెలిపారు. లోకేశ్వరరెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు కుటుంబాలతో ప్రశాంతంగా ఉన్న కంపమల్లలో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించి భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని అంతమొందిస్తే తమకు అడ్డు ఉండదని గ్రామానికి చెందిన చిన్న సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు లక్ష్మీ నారాయణరెడ్డి, మరికొందరు దాడికి తెగబడ్డారని పేర్కొన్నారు. గతంలో కూడా లోకేశ్వరరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, ఆ కేసు ఇప్పటికి నడుస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే ఆ కుటుంబంపై కక్ష మరింత పెంచుకున్నారన్నారు. కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి పక్కన కాల్వ తీసి మట్టిని అడ్డంగా పోశారన్నారు. ఈ విషయాన్ని అప్పట్లో కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్వరరెడ్డి కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాటసానితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, జిల్లెల్ల శంకర్‌రెడ్డి, వెలగటూరు సర్పంచ్ ఎల్వీ సుధాకర్‌రెడ్డి, భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, భీమునిపాడు అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వీరారెడ్డి, ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, మల్లు హరినాథరెడ్డి, గుంజలపాడు రామసుబ్బారెడ్డి, తదితరులు లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పచ్చని గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారు
కంపమల్ల ఘటనను
వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం
లోకేశ్వరరెడ్డి కుటుంబానికి
అండగా ఉంటాం
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి