కందిపప్పు ఇవ్వలేదు
మార్చి నెలకు సంబంధించి బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా చేశారు. కందిపప్పు ఇవ్వలేదు. గతంలో వీటితోపాటు జొన్నలు, రాగులు, తదితర నిత్యావసరాలు అందించారు. కందిపప్పు, ఇతర నిత్యావసరాలు అందకపోవడంతో బయటి మార్కెట్‌లో అధిక ధర పెట్టి కొనుగోలు చేయడం భారంగా మారింది.
– రఘు, కార్డుదారుడు, కోవెలకుంట్ల
రంజాన్ తోఫా ఇవ్వాలి
గతంలో రంజాన్ పండుగకు గోధుమపిండి, చక్కెర, సేమియాలు, ఆయిల్. నెయ్యితో కూడిన తోఫా ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎలాంటి తోఫాలు ఇవ్వడం లేదు. ఈ నెల 31వ తేదీన రంజాన్ పండుగ ఉంది. పండుగను దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరిగానే రంజాన్ తోఫా ద్వారా సరుకులు అందజేయాలి.
– దస్తగిరి, కార్డుదారుడు, కోవెలకుంట్ల
కందిపప్పు ఇవ్వలేదు