
మేలో పూర్తి స్థాయిలో దిగుబడి
జనవరి నెలలో ఈ పంట పూత దశ ఉన్న సమయంలో తేనే మంచుపురుగు ఆశించి కొంత మేర దెబ్బతిన్నా సస్యరక్షణ చర్యలతో దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వారం రోజులుగా దిగుబడి లభిస్తుండగా మే నెలలో పూర్తి స్థాయిలో దిగుబడి మార్కెట్‌కు చేరుతుంది.
– అబ్దుల్ హమీద్, మామిడి తోటల
యజమాని, బనగానపల్లె
గతేడాది కంటే తక్కువ ధర
గతేడాది వంద మామిడి పండ్లు రూ. ఐదారు వేల వరకు విక్రయించగా ఈ సంవత్సరం రూ. నాలుగైదు వేలకు మించడం లేదు. పండ్లు నాణ్యతగా ఉన్నాయి. వ్యాపారం కూడా పదిరోజుల్లో ఊపందుకుంటుందని అనుకుంటున్నాం. బంగినపల్లి రకం రుచి అద్భుతంగా ఉంటుంది.
– ఖాదర్‌వలి, పండ్లవ్యాపారి, బనగానపల్లె

మేలో పూర్తి స్థాయిలో దిగుబడి