![ధాన్యం కొనేదెప్పుడు?](/styles/webp/s3/article_images/2024/11/13/09nrpt302-210086_mr-1731438383-0.jpg.webp?itok=2uY3-Omp)
ధాన్యం కొనేదెప్పుడు?
మరికల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం పెడుతున్న కొన్ని నిబంధనలకు మిల్లర్లు ముందుకు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు కన్పిస్తుంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ పొలాల వద్ద ఆరబెట్టిన ధాన్యం రాశులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాటి దగ్గర రాత్రింబవళ్లు కాపాలా ఉండాల్సిన పరిస్థితులు రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వరి ధాన్యం సేకరణకు మారిన నిబంధనలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 101 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 96 కేంద్రాలను ప్రారంభించారు. 90 కేంద్రాలకు 5.50 లక్షల గన్నీ బ్యాగులను పంపించారు. ఇన్ని రోజులకుగాను కేవలం 48 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ కాస్త ధాన్యం కూడా బిల్లులకు చేరలేదు. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో అధికారులు మరింత ఆలస్యం చేయడం వల్ల రైతులు కర్ణాటక ప్రైవేట్ వ్యాపారులకు ఎంతో కొంత ధరకు విక్రయించేస్తున్నారు. మరోపక్క కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు కల్పించకుండానే నిబంధనలను అమలు చేయడంపై రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నాఉ. సడలింపులు లేకుండా నిబంధనలు పాటిస్తామంటే బోనస్ కింద ఇచ్చే రూ.500 వచ్చేలా లేవంటున్నారు.
గతంలో నిబంధనలు ఇలా..
గతంలో ధాన్యం సేకరణకు అవసరమైతే లారీలను పొలాల వద్దకే పంపేవారు. అక్కడే తేమ శాతం చూసి తూకం వేసి గన్నీ బ్యాగుల్లో ఎత్తి లారీలకు నింపి మిల్లులకు తరలించేవారు. దీని వల్ల రైతులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండేవి కాదు. ఖర్చులు తక్కువగానే ఉండేవి. చిన్న రైతుల విషయానికి వస్తే నిర్వాహుకులు వారి కల్లాల వద్దకు వెళ్లి తేమ శాతాన్ని గుర్తించి తూకం చేసేవారు. సమీపంలోనే లారీ ఉంటే అక్కడికి ధాన్యాన్ని తరలించి మిల్లులకు పంపేవారు. మొత్తానికి పొలం దగ్గరి నుంచే మిల్లులకు ధాన్యాన్ని తరలించేవారు.
కేంద్రానికే ధాన్యం తరలింపుతో తిప్పలు
కొత్త ప్రభుత్వం రావడంతో ఽక్వింటాల్ ధాన్యం వెంబడి రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ప్రతి రైతు తప్పనిసరిగా ధాన్యాన్ని వాహనాల్లో కొ నుగోలు కేంద్రాన్ని తీసుకురావాలి. అక్కడే ఆరబెడి తే ఏఈవోలు తేమ శాతంతో పాటు ఏ రకం ధాన్యం అనేది గుర్తిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధా న్యం నాణ్యతగా ఉంటేనే గన్నీబ్యాగులు అందజేస్తా రు. అక్కడే గన్నీ బ్యాగుల్లో నింపి లారీల ద్వారా మిల్లులకు తరలిస్తారు. లారీకి కూడా జీపీఎస్ విధాన్నాని ఏర్పాటు చేసి పంపిస్తారు. ఒక వేళ కేంద్రాల వద్ద ఆరబెట్టుకోవడానికి స్థలం లేదని భావి స్తే రైతు ఎక్కడైనా రవాణా సౌకర్యం ఉన్న చోట ఆరబెట్టుకొని కేంద్రానికి తీసుకరావాలి. ముఖ్యంగా పొ లాల నుంచి మళ్లీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించాలంటే ట్రాక్టర్‌తో పాటు కూలీలు అవసరం పడుతారని ఖర్చు తడిసి మోపెడు ఆవుతోందని రైతులు వాపోతున్నారు. ఇలా ఖర్చులు భరిస్తూ విక్రయించడం కన్నా బయట ప్రైవేట్ వ్యా పారులకు అమ్మడమే సులువని కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
జిన్నారం శివారులో కర్ణాటక వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్న రైతులు
మారిన నిబంధనలతోరైతుల పరేషాన్
నేటికీ ఎంపిక కాని మిల్లులు
ఎక్కడి ధాన్యం రాశులు అక్కడే..
బోనస్‌పై ఆశలు వదులుకొని కర్ణాటక వ్యాపారులకు విక్రయిస్తున్న వైనం
జిల్లాలో 101 కొనుగోలు కేంద్రాలకు 96 కేంద్రాలు ప్రారంభం
ఇప్పటివరకు కొనుగోలు చేసింది48 మెట్రిక్ టన్నులే..
Comments
Please login to add a commentAdd a comment