![విద్య](/styles/webp/s3/article_images/2024/11/13/13112024-npt_tab-01_subgroupimage_1327997536_mr-1731438383-0.jpg.webp?itok=kHCcdLT3)
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
ఊట్కూరు: విద్యాభివృద్ధికి కృషి చేద్దామని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. మంగళవారం నిడుగుర్తిలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. పాఠశాలల మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు సుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, తల్లిదండ్రుల సమావేశాలను విధిగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ధనుంజయ్య, ఆంజనేయులు, లక్ష్మారెడ్డి, మహమ్మద్‌తకీర్, హిదాయితుల్లా, సుజాత తదితరులు పాల్గొన్నారు.
దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి
నారాయణపేట: వికారాబాద్ జిల్లా లగచర్లలో సోమవారం కలెక్టర్,అధికారులపై జరిగిన దాడి సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్‌తో కలిసి మాట్లాడారు. అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. డిజిపి ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగినదని ప్రకటించడం వారి నిస్సహాయతను నిదర్శనన్నారు. ముందే తెలిసినప్పుడు నిఘా సంస్థలు, పోలీసులు ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు. ఇక 12 రోజులైనా కొనుగోలు కేంద్రాలలో వరి కొనడం లేదని, రైతులకు న్యాయం జరగాలంటే మిల్లర్లనే కొనుగోలు కేంద్రాలకు పంపించి తేమ శాతం చూసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో ఈజీఎస్ పనుల్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని, ఒక్క మరికల్ మండలంలోని 17 గ్రామాల్లో రూ.2 కోట్ల 70 లక్షల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విచారణ జరిపించి అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మహబూబ్‌నగర్‌లో స్టెనో కం టైపిస్ట్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాపిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైపిస్ట్ ఒకటి (జనరల్– 1), రికార్డు అసిస్టెంట్ రెండు (ఓసీ మహిళ–1), (ఎస్సీ మహిళ– 1) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి అభ్యర్థులు రిజిష్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ఈ నెల 28 సాయంత్రం 5 గంటలలోగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కోర్టుల e-courtsవెబ్ సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలోవిలీనం చేయొద్దు..
మద్దూరు: మున్సిపాలిటీలో రెనివట్ల గ్రామాన్ని విలీనం చేయొద్దని గ్రామస్తులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాచేశారు. అక్కడ తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఎంపీడీఓ నర్సింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తా ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఎస్‌ఐ రాంలాల్ అక్కడి చేరుకొని ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు శంకర్, సల్మాన్, తిప్పన్న, కన్కప్ప, హాజర్, సాయప్ప, రాములమ్మ, తిప్పమ్మ, నర్సింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
![విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
1](/gallery_images/2024/11/13/13112024-npt_tab-01_subgroupimage_1328014640_mr-1731438384-1.jpg)
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
![విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
2](/gallery_images/2024/11/13/12mkl202-210058_mr-1731438384-2.jpg)
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
Comments
Please login to add a commentAdd a comment